ADB: నేరడిగొండ మండలంలోని కుప్టి, కుమారి గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో BSNL టవర్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. సిగ్నల్ సరిగా అందక ఇబ్బందులకు గురవుతున్నమన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని గ్రామస్తులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హామీ ఇచ్చారు.