SRCL: ఇటీవల అనారోగ్యానికి గురైన సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ని గచ్చిబౌలి కేర్ హాస్పిటల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. వైద్యులను వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. నాగుల సత్యనారాయణ గౌడ్ త్వరగా కోలుకోనీ మళ్ళీ యధావిధిగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.