CTR: కుప్పం(M) పరమ సముద్రం బేటరాయ స్వామి కొండపై టీటీడీ ఆధ్వర్యంలో శనివారం శ్రీవారి కల్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీవారి కల్యాణోత్సవం కోసం కొండపై భారీ ఏర్పాట్లు చేయగా స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామి ఉత్సవ మూర్తులను అలంకరించి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.