SKLM: హీరమండలం, తుంగ తంపర, జిల్లేడు పేట గ్రామాల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి శనివారం సాయంత్రం పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెంద వద్దు అని, నష్టపోయిన పంటలకు ప్రభుత్వమే నష్ట పరిహారం అందిస్తుందని రైతులకు భరోసా కల్పించారు.