తమిళనాడులోని సుప్రసిద్ధ మదురై మీనాక్షీ అమ్మవారి ఆలయానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఆలయంలో బాంబు పెట్టామని DGP ఆఫీసుకు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే డాగ్ స్క్వాడ్, బాంబు నిర్వీర్య బృందంలో కలిసి ఆలయ పరిసరాల్లో 3 గంటల పాటు తనిఖీలు చేసిన పోలీసులు నకిలీ బెదింపులుగా తేల్చారు. కాగా ఈ మధ్య కాలంలో ఇలాంటి బెదిరింపులు ఎక్కువయ్యాయి.