NLG: నార్కట్ పల్లి మండలం జివ్వి గూడెం గ్రామంలోని ఓ రిసార్ట్ స్విమింగ్ ఫుల్లో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. మృతులు నార్కట్ పల్లికి చెందిన నల్లగొండ రిషిక్(17), చౌటుప్పల్కి చెందిన పోలోజు హర్షవర్ధన్ (17) గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నల్లగొండ ఏరియా హాస్పిటల్కి తరలించారు.