MDK: విద్యార్థుల విద్యాసామర్థ్యం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ సూచించారు. వెల్దుర్తి మండల పరిధిలోని శేంశిరెడ్డిపల్లి తండా, చర్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను శనివారం సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.