VZM: శ్రీపైడితల్లమ్మ అమ్మవారి ఉత్సవాల వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్. దామోదర్తో కలిసి శనివారం పరిశీలించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సిరిమాను తిరిగే ప్రాంతాలలో శిథిలావస్థలో భవనాల వద్ద ఉంచకూడదని సూచించారు. పర్యటనలో జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, ఎఎస్పీ సౌమ్యలత ఉన్నారు.