E.G: గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో నల్లజర్ల జడ్పీ హైస్కూల్లో ఈనెల ఎనిమిదో తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నల్లజర్ల ఎమ్మెల్యే కార్యాలయంలో మేళాకు సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్యే మద్దిపాటి విడుదల చేశారు. ఈ మేళాలో పదవ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు 25 కంపెనీలు పాల్గొన్నారు.