NLR: పొదలకూరు మండలం, రాజుపాళెం, ఇనుకుర్తి, ముదిగేడు గ్రామాలలో మాజీ మంత్రి కాకాణి శనివారం పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. సర్వేపల్లిలో సోమిరెడ్డి అవినీతి, దోపిడీ తప్ప అభివృద్ధి కనిపించడం లేదని, సోమిరెడ్డి, ఆయన కొడుకులు 100 కోట్ల రూపాయల గ్రావెల్‌ను కొల్లగొట్టారని ఆరోపించారు. అనంతరం వారి కొడుకుల అక్రమాల వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.