CTR: చిత్తూరు పట్టణంలో మద్యం సేవించి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పట్టుబడిన 13 మందికి చిత్తూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఉమాదేవి జరిమానా విధించారు. ఒక్కొక్కరికి 10 వేలు చొప్పున 13 మందికి 1,30,000 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతరం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పారు.