MBNR: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ సీనియర్ నాయకులు పాండురంగారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మహబూబ్నగర్ రూరల్ మండలం ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలలో అందరూ సమన్వయంతో కలిసి ఒక్కతాటిపై నిలిచి పనిచేయాలని సూచించారు.