AP: ఆటోడ్రైవర్లకు వైసీపీ రూ.10 వేలు మాత్రమే ఇచ్చిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఫైన్ల రూపంలో మళ్లీ ఆ డబ్బులు తీసుకునేదని ఆరోపించారు. ఆటోకు జగన్ ఫొటో పెట్టుకోకపోయినా ఫైన్ వేసేవారని, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రూ.15 వేలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.