MDK: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ సూచించారు. కొల్చారం మండల కేంద్రంలో శనివారం మండల పార్టీ అధ్యక్షులు హరీష్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు.