BHNG: వెల్లంకికి చెందిన పాటల ప్రయాణికుడు, కవి బండ్ల కృష్ణకు అరుదైన గౌరవ డాక్టరేట్ లభించింది. ఢిల్లీ కల్చరల్ యూనివర్సిటీ వీసీ ఆయనకు ఈ పట్టాను అందించారు. హోంగార్డు విధుల్లో ఉంటూనే, పోలీస్ శాఖ కళా బృందంతో కలిసి పాటల ద్వారా వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. గతంలో కొవిడ్ సమయంలో ప్రత్యేక వేషధారణతో ప్రజలను అప్రమత్తం చేశారు.