NGKL: బిజినేపల్లి మండలం పాలెంలోని శ్రీ అలివేలుమంగ సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం శ్రీ సత్యనారాయణస్వామి సామూహిక వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రధాన అర్చకులు రామానుజాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన వ్రతాలలో 16 మంది దంపతులు పాల్గొన్నారు. సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించడం ద్వారా విశేష ఫలితాలు పొందుతారని అర్చకులు తెలిపారు.