ఇకపై X యాక్టివిజం నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు నటుడు రాహుల్ రామకృష్ణ ప్రకటించారు. ఈ మేరకు పోస్ట్ పెట్టారు. ‘నా కంటే గొప్ప మేధావులు ఎప్పటి నుంచో సామజిక సమస్యలతో పోరాడుతున్నారు. పాలన, పరిపాలన గురించి నాకేం తెలుసు? నేను కేవలం ఒక చిన్న నటుడిని మాత్రమే. ఇకపై రాజకీయాలకు సంబంధించి పోస్టులు పెట్టాలనుకోవడం లేదు. ఇకపై మూవీలపై ఫోకస్ పెడతాను’ అని పేర్కొన్నారు.