BHNG: విజయ డైయిరీపై కన్నతల్లి ప్రేమ చూపిస్తూ మదర్ డైయిరీపై సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తున్నారని, ఉమ్మడి నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల మదర్ డైరీ డైరెక్టర్ సందిల భాస్కర్ గౌడ్ అన్నారు. శనివారం రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకుల చేతగాని తనంతో మదర్ డైయిరీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు.