WGL: పట్టణ కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్ను క్రైమ్ ఏసీపీ సదయ్య శనివారం వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ రికార్డులు, సీడీ ఫైల్స్, పెండింగ్ కేసులను వివరంగా సమీక్షించారు. అనంతరం, పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వర సాయం అందించాలని, సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు చేశారు.