NLG: నార్కట్ పల్లి మండలం జివ్విగూడెంలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. స్తానిక వెంకటేశ్వర్లు బావి కాలనీ సమీపంలో ఓగెస్ట్ హౌస్‌లో ఉన్న పాత బావిని గతంలో స్విమ్మింగ్ పూల్‌గా మార్చారు. అయితే కామినేని విద్యాపీఠ్ స్కూల్‌కు చెందిన 13 మంది విద్యార్థులు ఆ స్విమ్మింగ్ పూల్‌కు ఈతకు వెళ్లారు. ఈత రాక ఇద్దరు పిల్లలు గల్లంతవ్వగా వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.