CTR: కష్టాల్లో ఉన్న తమ తోటి ఫోటోగ్రాఫర్ కుటుంబానికి అండగా నిలిచి, జిల్లా ఫోటోగ్రాఫర్స్ యూనియన్ గొప్ప మనసు చాటుకుంది. కొత్తపేట మండలం, వాడపాలెం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ సత్య ప్రసాద్ కుటుంబానికి యూనియన్ తరపున ప్రకటించిన రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, సత్య ప్రసాద్ కుటుంబ సభ్యులకు చెక్కు రూపంలో అందించారు.