NZB: జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన దుబ్బ ప్రాంతంలో నిర్మాణాలను పరిశీలించి, పునాది దశ వరకు పూర్తి చేసుకున్న లబ్ధిదారులతో మాట్లాడారు. పనులు ప్రారంభించని వారిని కారణాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక, మంజూరీ ప్రక్రియలలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు.