SKLM: ఇచ్చాపురం మండలం ఇన్నీసు పేటలో ఇటీవల కురిసిన వర్షానికి నీట మునిగిన పంట పొలాలను జిల్లా పరిషత్ ఛైర్మన్, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త పిరియా విజయ శనివారం పరిశీలించారు. నీట మునిగిన పంట పొలాల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతులు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు. ఆమె వెంట పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు.