SKLM: ఆమదాలవలస మండలం కనుగులవలసకు చెందిన రైతు కే. నారాయుడు (64) నాగావళి నదిలో శనివారం జారిపడి గల్లంతయ్యారు. దూసి గ్రామం సమీపంలో ఉన్న పంట పొలాలకు యూరియా జల్లి దగ్గరలో ఉన్న నాగావళి నదిలో చేతులు శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నదిలోకి జారి పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.