VSP: కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని జిల్లా సాంఘిక సంక్షేమ, జిల్లా ఇంఛార్జి మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖలోని చిల్డ్రన్ ఏరినాలో జరిగిన “ఆటో డ్రైవర్ల సేవలో” కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. జిల్లాలో 22,955 మంది డ్రైవర్లకు రూ. 34.43 కోట్ల లబ్ధి చేకూరిందని వెల్లడించారు.