SRD: ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నట్లు సిర్గాపూర్ ఎస్సై మహేష్ తెలిపారు. పోచపూర్కు చెందిన శివకుమార్ (34) శనివారం ఉదయం ఇంటి నుంచి బైక్ పై బయలుదేరి వెళ్లాడు. తను చేసిన అప్పుల విషయంలో ఇంట్లో చిన్నచిన్న గొడవలు, మనస్పర్ధలు రావడంతో విసుగు చెంది మార్గ మధ్య నల్లవాగు ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై తెలిపారు.