AP: ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, అల్లూరి జిల్లాలో పిడుగులతోపాటు మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. సంబంధిత జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు రావొద్దని సూచించింది.