SRPT: ప్రభుత్వ ఆస్పత్రులలో సాధారణ ప్రసవాలు పెంచేలా చూడాలని, ఈ విషయంలో గర్భిణీలకు సైతం అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శనివారం కలెక్టర్ అర్వపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.