AP: స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. అయ్యన్నలాంటి క్వాలిటీస్ నిజంగానే వైఎస్ జగన్కు లేవని, అయ్యన్నలా అబద్ధాలు చెప్పడం రాదన్నారు. అయ్యన్నలా మందు అలవాటు లేదని, నోటికి వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడరన్నారు. అయ్యన్నలో ఉన్న మంచి లక్షణాలు ఏంటో చెబితే.. అవి తమ నాయకుడు వైఎస్ జగన్కు చెబుతా అని అమర్నాథ్ ఎద్దేవా చేశారు.