SRPT: కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కస్తూరి చిత్రపటానికి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.