VZM: ఈ నెల 7న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి శ్రీ పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి పట్టువస్త్రాల సమర్పణకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.