NGKL: అచ్చంపేట ప్రాంతం నుంచి శ్రీశైలం ట్రస్టు బోర్డులో అవకాశం కల్పించాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. దీనిపై ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. అందుకు సానుకూలంగా స్పందించి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డిని ట్రస్టు బోర్డులో నియమించారు. ఈ నియామకంపై ఏపీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.