VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం కూటమి నాయకులతో కలిసి ఎచ్చెర్ల హెడ్ క్వార్టర్స్‌లో GST సంస్కరణలపై MDO ఆఫీసు నుంచి ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ దుకాణాలను సందర్శించి కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన GST సంస్కరణలను గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సంస్కరణల వలన ధరలు ఎంత మోతాదులో తగ్గుతున్నాయి అనేది అవగాహన కల్పించారు.