NRML: కడెం ప్రాజెక్టు పరిసరాల్లోకి ప్రజలు, పశుకాపరులు రావద్దని ఇరిగేషన్, ప్రాజెక్టు అధికారులు సూచించారు. శనివారం వారు మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తామన్నారు. ప్రాజెక్ట్ పరిసరాలలోకి ఎవరూ రావద్దని వారు కోరారు.