AP: యూరియాపై అధికారుల దగ్గర లెక్కలు లేవని వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఏ రోజు ఎంత యూరియా అవసరమో తెలుసుకోవాలని, ఇంట్లో దాచుకోవడానికి యూరియా పంచదార కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో పంటలకు యూరియా వేయాలని ప్రభుత్వానికి బొత్స హితవు పలికారు. అలాగే, రైతుల అవసరాలు దృష్టిలో పెట్టుకోవాలని వ్యవసాయ మంత్రికి సూచించారు.