NLG: కనగల్ మండలం పగిడిమర్రిలో నీటి సంపులో పడి మూడేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. గ్రామానికి చెందిన ఇటికాల రామలింగం- శ్రీలత కొడుకు హర్షద్ రామ్(3) ఇంటి ఆవరణలో బొమ్మలతో ఆడుకుంటుండగా బొమ్మ నీటి సంపులో పడింది. దానిని బయటకు తీసే క్రమంలో బాలుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. కొడుకు నీటిలో పడి ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు బయటకు తీయగా అప్పటికే అతను మృతిచెందాడు.