MBNR: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. గ్రామ మండల స్థాయిలో మన గొంతు వినిపించాలంటే ఖచ్చితంగా విజయం సాధించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఇంటింటికి వెళ్లి వివరించాలన్నారు. కాంగ్రెస్ 420 హామీలతో అధికారంలోకి వచ్చింది అన్నారు.