BDK: దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామంలో శనివారం తెలంగాణ ఫామ్ ఆయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో ఆయిల్ ఫామ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో ఆయిల్ ఫామ్ విస్తరణకు కృషి చేస్తామన్నారు.