కోనసీమ: ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శనివారం రావులపాలెంలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన కలిసి పాల్గొన్నారు. ఇందులో భాగంగా రావులపాలెం క్యాంప్ కార్యాలయం నుండి సెయింట్ పాట్రిక్ స్కూల్ వరకు జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.