CTR: ఆటో డ్రైవర్ల ఆర్థిక కష్టాలు తీర్చే మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన “ఆటో డ్రైవర్ల సేవలో” సంక్షేమ పథకంపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. శనివారం నగరంలోని ఆటో డ్రైవర్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ వారి కార్యాలయం ప్రజాదర్బార్ లో సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆటో డ్రైవర్లకు మిఠాయిలు తినిపించారు.