ప్రకాశం: పీసిపల్లి మండలం పెద ఇర్లపాడుకు చెందిన పోలు జగన్మోహన్ రెడ్డి, రమేష్ రెడ్డితో పాటు పలువురు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి , మండల నాయకుల ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్లో వారు పార్టీలో చేరారు. వెనుకబడిన కనిగిరి అభివృద్ధి కోసం అందరం ఐక్యంగా కృషి చేద్దామని ఎమ్మెల్యే సూచించారు.