SKLM: జిల్లా కేంద్రం మెడికల్ మాఫియాకు నిలయంగా మారిందని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ అన్నారు. శనివారం శ్రీకాకుళం పట్టణం క్రాంతి భవన్లో మీడియాతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని విమర్శించారు.