TPT: పిచ్చాటూరులోని శ్రీ మలయ పెరుమాళ్ స్వామి ఆలయంలో పెరటాసి నెల మూడవ శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేక పూజలు జరిగాయి. ఇందులో భాగంగా మలయ పెరుమాళ్ స్వామిని తులసి, తామర పువ్వులతో సుందరంగా అలంకరించి నైవేద్యం సమర్పించి, కర్పూర హారతి ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ప్రసాదాలు అందజేశారు.