TG: RRR ప్రాజెక్ట్ అలైన్మెంట్ పూర్తిగా సిద్ధం కాలేదని, కేవలం DPR మాత్రమే సిద్ధమైందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ‘రైతులు ఆందోళనలు, ధర్నాలు చేయవద్దు. నా ఊపిరి ఉన్నంత వరకు అన్యాయం జరగనివ్వను. 2018లో కేంద్రం ఆమోదించిన RRRను.. అప్పటికే కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదు. RRR రైతులకు నష్టపరిహారం పెంచుతాం’ అని హామీ ఇచ్చారు.