వనపర్తి బస్టాండ్లో ఆగి ఉన్న డీలక్స్ బస్సు సాంకేతిక లోపం కారణంగా అకస్మాత్తుగా ముందుకు కదిలి బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన ఆ బస్సు రోడ్డుపై ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొని ధ్వంసం చేసింది. అయితే, బైక్పై ఉన్న వ్యక్తి బస్సు కదలికను ముందే గుర్తించి వెంటనే పక్కకు పారిపోవడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యారు.