JN: పాలకుర్తి నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు వడ్లకొండ తార, ఓయూ జేఏసీ నేత ఇప్ప పృథ్వీరెడ్డి సహా పలువురు నేతలు శనివారం కాంగ్రెస్ పార్టీని వీడి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో ఇవాళ బీఆర్ఎస్లో చేరారు. రానున్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని దయాకర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో BRS శ్రేణులు పాల్గొన్నారు.