NLG: సమాజంలో ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ నెల 4 నుంచి 12 వరకు మానసిక ఆరోగ్యం శ్రేయస్సు పై లయన్స్ క్లబ్, నల్గొండ వారు నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా శనివారం నల్గొండ, ఎన్జీ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించవచ్చన్నారు.