NRML: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు స్థానిక ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ అన్నారు. శనివారం దస్తురాబాద్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పి.రాజు, నాయకులు ఉన్నారు.