హనుమకొండ జిల్లా కలక్టరేట్ కార్యాలయం ఆవరణలో శనివారం స్థానిక సంస్థల ఎన్నికల సహాయక కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ప్రారంభించారు. ప్రతి నిత్యం 24 గంటలు సహాయక కేంద్రం పని చేస్తుందని కలెక్టర్ ప్రకటించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన సమాచారం 7981975495 ఈ నెంబర్కు ఫోన్ చేయాలని కోరారు.