ప.గో: యువకుడు హత్య కేసులో ఆరుగురిని తణుకు పోలీసులు శనివారం అరెస్టు చేశారు. డీఎస్పీ విశ్వనాథ్ వివరాలు వెల్లడించారు. తాడేపల్లిగూడేనికి చెందిన మడుగుల సురేశ్‌ను తణుకునకు చెందిన న్యాయవాది సత్యనారాయణ రాజుతోపాటు మరో నలుగురు కలిసి హత్య చేసి గోన సంచిలో మూటగట్టి గోదావరిలో పడవేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో న్యాయవాది భార్య శిరీషతో పాటు మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు.